Manavatvam Seva
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ ముద్రగడ రమేష్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారి పుట్టినరోజు వేడుకలు🥳

BLOG ARTICLE

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ ముద్రగడ రమేష్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారి పుట్టినరోజు వేడుకలు🥳

కాకినాడ సాంబమూర్తి నగర్ లో డైరీ ఫార్మ్ సెంటర్ దగ్గర ఉన్న ప్రభుత్వ బధిరుల ఉన్నత పాఠశాలలో సుమారు 60 మంది విద్యార్థిని విద్యార్థులకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారి పుట్టినరోజు సందర్భంగా రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేసిన నడకుదురు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ ముద్రగడ రమేష్ గారు ,🙏

🌹 జన్మదిన శుభాకాంక్షలు – సేవా కార్యక్రమం 🌹

తేది : 11-09-2026 | శుక్రవారం

గౌరవనీయులైన కాకినాడ రూరల్ శాసనసభ సభ్యులు
శ్రీ పంతం వెంకటేశ్వరరావు గారు (అలియాస్ నానాజీ గారు)
పుట్టినరోజు సందర్భంగా...

❤️ అభిమానంతో ఆప్యాయ సేవ ❤️

నడకుదురు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్
శ్రీ ముద్రగడ్డ రమేష్ గారు,
ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారి పట్ల ఉన్న అపారమైన అభిమానంతో, కాకినాడ సాంబమూర్తి నగర్ డైరీ ఫారం సెంటర్ సమీపంలోని ప్రభుత్వ బధిరుల ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు సుమారు 60 మందికి రుచికరమైన భోజనం ఏర్పాటు చేశారు.

ఈ సేవా కార్యక్రమంలో శ్రీ ముద్రగడ్డ రమేష్ గారు స్వయంగా తన చేతులతో విద్యార్థులకు భోజనం వడ్డించి, వారి యోగక్షేమాలను ఆప్యాయంగా తెలుసుకున్నారు.

అనంతరం విద్యార్థినీ విద్యార్థులు, జనసేన సభ్యుల సమక్షంలో పిల్లల చేతుల మీదుగా కేక్ కట్ చేయించి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 🎂💐

ఈ పిల్లలను ఆదరిస్తూ అండగా నిలుస్తున్న మన ప్రభుత్వానికి, అలాగే వారిని సొంత బిడ్డల్లా చూసుకుంటున్న పాఠశాల యాజమాన్యానికి శ్రీ ముద్రగడ్డ రమేష్ గారు ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. 🙏

❤️ సేవే లక్ష్యం – మానవత్వమే మార్గం ❤️