Manavatvam Seva
మన మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం🙏

BLOG ARTICLE

మన మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం🙏

అనుకోని సంఘటన కారణంగా మరణించిన కీర్తిశేషులు వెంట్రు ప్రసాద్ గారి కుటుంబానికి నిత్యవసర సరుకులు ఆర్థిక సహాయంగా అందజేసిన మానవత్వం

మన మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం🙏

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం పెద్ద చొల్లంగి గ్రామంలో నివసిస్తున్న శ్రీ వెంట్రు ప్రసాద్ గారు అనుకోని సంఘటన కారణంగా మరణించడంతో, వారి కుటుంబ పరిస్థితిని గురజనాపల్లి జనసేన నాయకులు శ్రీ సుందర సత్తిబాబు మన మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ దృష్టికి తీసుకువచ్చి, కొంత ఆర్థిక సాయం అందజేసి ఆ కుటుంబానికి సహాయం చేయవలసిందిగా కోరడం జరిగినది.

దీనిపై స్పందించిన మన మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, ఆ కుటుంబానికి ప్రస్తుతానికి తినడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిత్యవసర సరుకులు మరియు ఆర్థిక సహాయం అందజేయడం జరిగినది.

ఈ సేవా కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకువచ్చిన శ్రీ సుందర సత్తిబాబు గారికి మానవత్వం తరఫున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము. 🙏

మానవత్వమే మా మతం – సేవే మా మార్గం ❤️